Tuesday, August 26, 2025

వినాయక చవితి వేళ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో మండపాలకు (Ganesh Mandapas) ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులు పలువురు మంత్రి లోకేశ్‌ను కోరారు. దీంతో లోకేశ్ సిఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికూమార్‌తో మాట్లాడి.. ఉచిత విద్యుత్‌కు ఒప్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గణేశ్ విగ్రహాలు (Ganesh Mandapas) ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుంది. రాష్ట్రంలోని కోట్లాది భక్తుల సౌలభ్యం కోసం మంత్రి లోకేశ్ అభ్యర్థన మేరకు సిఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక జివొను విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నవరాత్రుల సమయంలో ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News