భారతీయ ఉత్పత్తులపై అమెరికా పెంచిన 50 సుంకాలు అమలులోకి రానున్ననేపథ్యంలో ఎగుమతి దారులు తీసుకోవలసిన చర్యలను సమీక్షించేందుకు ప్రధాని కార్యాలయంలో ఆగస్టు 26 ఉన్నతస్థాయి సమావేశం జరుగనున్నది. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా ప్రస్తుత సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత ఎగుమతి దారులపై ఒత్తిడి పెరిగింది బుధవారం నుంచి అమెరికా లో ప్రవేశఇంచే భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించబడుతుంది. ఇప్పటికే వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎగుమతి దారులు, ఎగుమతుల ప్రమోషన్ కౌన్సిల్ తో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం 25 శాతం సుంకం కారణంగా మార్జిన్ లను తగ్గించామని , అలాగే పోటీ తత్వం కూడా దగ్గిందని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఎగుమతి దారులు రిస్క్ కవర్ కోసం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ వర్కింగ్ క్యాపిటల్ ను అందించాలని కోరుతున్నారు. ఈ అంశంతో పాటు విధాన పరమైన పలు అంశాలు రేపటి చర్చలలో ప్రస్తావనకు వస్తాయి.