Tuesday, August 26, 2025

192 మంది జర్నలిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ గత 22 నెలలుగా సాగిస్తున్న యుద్ధంలో గాజాలో మొత్తం 192 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టు ప్రకారం 18 మంది జర్నలిస్టులు రష్యాఉక్రెయిన్ యుద్ధంలో చనిపోగా, గాజాలో ఇంతవరకు మొత్తం 192 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని పోల్చి చెప్పింది. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కానీ, ఇజ్రాయెల్ మిలిటరీ కానీ ఎలాంటి స్పందన వెలువరించలేదు. ఈ సంఘటనతోపాటు ఉత్తర గాజా లోని ఆస్పత్రి అధికారులు కూడా సహాయ కేంద్రాల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల ఒక చిన్నారితో సహా ముగ్గురు పాలస్తీనియన్లు, మృతి చెందారని చెప్పారు. సెంట్రల్ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రానికి చేరుకోడానికి ప్రయత్నించే పాలస్తీనియన్లపై దాడులు జరగడంతో ఆరుగురు మృతి చెందారని 15 మంది గాయపడ్డారని అల్ అవ్డా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు అసామాన్యమేమే కాదు. గాజా స్ట్రిప్‌లో అనేక ఆస్పత్రులపై దాడులు సాగుతున్నాయి. ఆస్పత్రుల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని, అందువల్ల దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. గత జూన్‌లో నాజర్ ఆస్పత్రిపై దాడిలో ముగ్గురు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. ఆస్పత్రి లోపల కమాండ్, కంట్రోల్ సెంటర్ నుంచి హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ చేస్తున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ఆనాడు చెప్పుకొచ్చింది. అలాగే కాల్పుల విరమణణ ఒప్పందం విఫలం అయిన తరువాత మార్చిలో ఆస్పత్రి సర్జికల్ విభాగంపై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 62686 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. పోరుగాళ్లు, పౌరులు అన్న విచక్షణ లేకుండా దాడులు చేస్తోందని , ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో సగానికి సగం మంది మహిళలు, పిల్లలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News