Tuesday, August 26, 2025

బాలుడు శ్రీతేజ్ ఫ్యామిలీకి ప్రభుత్వం మరో సాయం

- Advertisement -
- Advertisement -

బాలుడు శ్రీతేజ్ చెల్లెలికి 18 ఏళ్లు వచ్చే వరకూ నెలకు రూ.4 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఛైల్డ్ రైట్స్ కమిషన్ చొరవతో ’మిషన్ వాత్సల్య’ పథకాన్ని ఆ కుటుంబానికి వర్తించేలా చేసింది. దీంతో బాధిత కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పుష్ప 2’ మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలుడు కోలుకున్నాడు. ఇప్పటికే మూవీ టీంతో పాటు అల్లు అర్జున్ కూడా బాలుని వైద్యానికి, ఆ కుటుంబానికి, బాలుని భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు. గతేడాది డిసెంబర్ 4న ’పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడడం తో తోపులాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా కోలుకున్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మూవీ టీం, హీరో బన్నీ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, అల్లు అరవింద్ రూ.2 కోట్లు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కోమటి రెడ్డి రూ.25 లక్షలు అందజేశారు. బాలునికి వైద్య సేవలను ఉచితంగా అందించారు. అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ వైద్య పరిస్థితిని తెలుసుకుంటూ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో సాయం అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News