Tuesday, August 26, 2025

వారంలో మరింత యూరియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ఎంపీలు కేంద్రం పై తీసుకువచ్చిన ఒత్తిడితో ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ – మం త్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా – రాష్ట్రానికి వచ్చిన వెం టనే డిమాండుకు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపికి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీచేశారు. – ఇతర దేశాల నుంచి యూరియా తెప్పించి, రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం ఘోర విఫలమైందన్నారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నాలను రైతులు అర్ధం చేసుకున్నారని తెలిపారు. – కేంద్రం తరఫున రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి చింతిస్తున్నట్లు మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారంగా రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంత వరకైనా పోరాడుతామన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ నుంచి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే సదరు కంపెనీ ఎండీతో మాట్లాడిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు – మంత్రి తుమ్మల వివరించారు.

రైతాంగానికి బహిరంగలేఖ
కేంద్రం అసమర్ధత కారణంగా ఏర్పడ్డ యూరియా కొరతపై, జిల్లాల్లో రైతుల ఆందోళనల నేపధ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి ఆరు పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇటీవల యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ సాగుతున్న రైతుల ఆందోళనలు, చెప్పులు పెట్టి క్యూ లైన్ లు ఉండడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో వాస్తవాలను బహిరంగలేఖలో వివరించారు. యూరియా కొరతకు కారణాలు ఏమిటి ? వాస్తవాలు దాచి పెట్టే పెద్దలు ఎవ్వరు ? రైతుల ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలు చేసే పార్టీలు ఏవీ ? అనే అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రైతన్నలకు వాస్తవాలు తెలియజేస్తున్నట్లు ఆ బహిరంగ లేఖలో వివరాలను పొందుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News