- Advertisement -
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే కొత్త హోమ్ ఇన్సూరెన్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది కేవలం రూ.181 (జిఎస్టితో సహా) ప్రీమియంతో లభిస్తోంది. కవరేజ్ రూ.10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు ఉంటుంది. వినియోగదారులు తమ ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్, అప్లయన్సెస్, విలువైన వస్తువులు వంటి వాటిని 20కి పైగా రిస్క్‌ల నుంచి రక్షించుకోవచ్చు. ఈ పాలసీకి పేపర్‌వర్క్ అవసరం లేదు, వెంటనే ఆన్లైన్లో జారీ అవుతుంది. హోమ్ లోన్ ఉన్నా లేకపోయినా అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు దీన్ని అంగీకరిస్తాయి. ఫోన్‌పే సిఇఒ విశాల్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి భారతీయుడు సులభంగా, తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ పొందాలనేదే మా లక్ష్యమని తెలిపారు.
- Advertisement -