Tuesday, August 26, 2025

వికటించిన మధ్యాహ్న భోజనం

- Advertisement -
- Advertisement -

21మంది విద్యార్థులకు అస్వస్థత బిచ్కుంద ప్రభుత్వ
ఆసుపత్రిలో చికిత్స నిజామాబాద్ జిల్లా శెట్లూర్
గ్రామంలోని ప్రైమరీస్కూల్‌లో ఘటన ఆసుపత్రిని
సందర్శించిన సబ్ కలెక్టర్

నిజామాబాద్ జి ల్లా, బిచ్కుంద మండల, శెట్లూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువు రు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు ఎంఈఓకి తెలపడంతో వెంటనే విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్సలు చే యించారు. మొత్తం 44 మంది విద్యార్థులకు గాను సుమా రు 21 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థులతో మాట్లాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ మాజీ ఎంఎల్‌ఎ హన్మంత్ షిండే బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు, కలుషిత నీరు తాగడం వల్ల జరిగినట్లు విద్యార్థుల త ల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. మంచి బియ్యం సరఫరా చేయాలని మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డికి సబ్ కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు రోజు వారీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేవరకు చికిత్సలు నిర్వహించాలని తెలిపారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే హ న్మంత్ షిండే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చిక్తిసలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణు గోపాల్, ఎంపీడీవో గోపాల కృష్ణ, ఎస్సై మోహన్ రెడ్డి, డిప్యూటి తహసీల్దార్ భరత్, డాక్టర్ రాజు, నాయకులు బొమ్మల లక్ష్మణ్, నాల్చెర్ రాజు, బస్వరాజ్ పటేల్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News