Tuesday, August 26, 2025

ప్రియురాలి నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియుడితోనే ఉంటానని బలవంతం చేయడంతో ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతంలోని సలిగ్రామ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సిద్ధరాజు అనే యువకుడితో దర్శిత(22) ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమాయణం నడిపించడంతో పాటు శారీరకంగా కలుసుకున్నారు. దర్శిత పెళ్లి చేసుకుందామని పలుమారు ప్రియుడిని అడిగింది. కానీ అతడు సాకులు చెబుతూ దాటవేశాడు. కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తితో దర్శితకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ దంపతులకు కూతురు పుట్టిన వెంటనే సుభాష్ వృత్తిరీత్యా దుబాయ్‌కి వెళ్ళిపోయాడు.

Also Read: ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు

భర్త లేకపోవడంతో సిద్ధరాజుతో దర్శిత అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తనకు భర్త అవసరం లేదని కూతురుతో వచ్చేస్తానని దర్శిత తన ప్రియుడిని బలవంతం చేసింది. దీంతో ప్రియురాలిని ఎలాగైనా వదిలించుకోవాలని సిద్ధరాజు ప్లాన్ వేసి హోటల్‌కి తీసుకెళ్లాడు. దర్శితను దారుణంగా కొట్టి అనంతరం నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. ముఖం చిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో దర్శిత చనిపోయింది. రెండు రోజులుగా తన కోడలు కనిపించడం లేదని అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారమిచ్చిన హోటల్ సిబ్బంది విచారణలో ఛార్జింగ్ పెట్టి ఉన్న సెల్ ఫోన్ పేలడంతో దర్శిత చనిపోయిందని సిద్ధరాజు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే సిద్ధరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News