Tuesday, August 26, 2025

పవర్‌ఫుల్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

అమరన్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శివకార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’(Madrasi) తో రాబోతున్నారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టైటిల్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్‌తో మంచి అంచనాలను సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఏఆర్ మురుగదాస్ మాస్, ఎమోషన్ కలిపిన ఒక యూనిక్ కథని చూపించారు.

సుదీప్ ఎలమోన్ కెమెరా వర్క్ గ్రాండ్ విజువల్స్ అందించింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ పెంచేస్తుంది. శివకార్తికేయన్ విభిన్న లేయర్స్ ఉన్న క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. విలన్‌గా విద్యుత్ జమ్వాల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌తో మదరాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News