Tuesday, August 26, 2025

నేను ఆ కార్డులను ఉపయోగిస్తే… చైనా నాశనం అవుతుంది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఈ సంవత్సరం చివరలో తాను చైనా పర్యటనకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా, అమెరికా మధ్య అద్భుతమైన సంబంధాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజింగ్‌తో తాము సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువ అని హెచ్చరించారు. వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని తెలియజేశారు. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, వాళ్ల కంటే తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కార్డులతో తాము ఆట ఆడుకోవాలని లేదని, తాము ఒకవేళ ఆడితే చైనా నాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి కావాల్సిన మ్యాగ్నెట్స్‌ను చైనా తమకు దిగుమతి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైనా వాళ్లు మ్యాగ్నెట్స్‌ను దిగుమతి చేయకుంటే టారిఫ్‌లను 200 శాతం పెంచుతామని ట్రంప్ వివరించారు. అందుకే ఆ కార్డులతో ఆడటం లేదని చెప్పారు.

అమెరికా టెక్ కంపెనీలపై పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ పన్నులపై ట్రంప్ మండిపడ్డారు. మా టెక్ కంపెనీలపై పన్నుల రూపంలో జరుగుతున్న దాడులకు ఎదురునిలబడుతానని చెప్పారు. డిజిటల్ పన్నులు, డిజిటల్ సర్వీసెస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ రెగ్యులెషన్స్ లాంటి అమెరికా టెక్నాలజీకి హాని కలిగిస్తున్నాయని, చైనా కంపెనీలపై ఎలాంటి పన్నులు వేయడంలేదని మండిపడ్డారు. ఇవన్నీ ఆగాలంటే ఆయా దేశాలపై అదనపు టారిఫ్‌లు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మా టెక్ కంపెనీలను గౌరవించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News