హైదరాబాద్: కేంద్రం నిధుల కోసమే ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతాయని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandisanjay) తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పంచాయితీలకు ఒక్క పైసా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో బండి మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల చోరి ఆరోపణలు అర్థరహితమని, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని తెలియజేశారు. వార్డు సభ్యుడు కానివాళ్లు కూడా విమర్శించడం సరికాదని, దొంగఓట్లు అంటూ చేసే ఆరోపణలు 8 నియోజక వర్గాల్లోని ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. 6 గ్యారెంటీలపై ప్రజలు కొట్టేట్లు ఉన్నారని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. కరీంనగర్ లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లున్నాయని పేర్కొన్నారు.
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ లో అధికారం ఎలా వచ్చింది? అని బండి ప్రశ్నించారు. ఓటు చోరి చేసినట్లైతే తామే అధికారంలోకి వస్తాం (come to power) కదా? అని అన్నారు. ఎన్నికలున్నా.. లేకున్నా హిందూ ధర్మం కోసం నిలబెడతాం అని స్పష్టం చేశారు. భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు వాళ్లెక్కడికి వెళ్లారని నిలదీశారు. తమది దేవుళ్ల పార్టీ అని మీది బిచ్చపు బతుకు అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం కోసం బిజెపి నిలబడుతుందని, యుపిఎ హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారని తెలిపారు. కరీంనగర్ లో హిందూ ఓటు ద్వారానే గెలిచానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Also read :చిన్నారి ప్రాణం తీసిన పురుగు