Tuesday, August 26, 2025

ఆమె పోస్ట్‌కి విరాట్ లైక్.. నటి రియాక్షన్ ఇదే..

- Advertisement -
- Advertisement -

సోషల్‌మీడియాలో తమ అభిమాన సెలబ్రిటీలు ఎవరినైనా కొత్త వ్యక్తులను సోషల్‌మీడియాలో ఫాలో అవ్వడమో, లైక్ చేయడమో చేస్తే.. ఆ వ్యక్తిని ఫ్యాన్స్ అందలం ఎక్కిస్తారు. నటి అవ్‌నీత్ కౌర్ (Avneet Kaur) విషయంలోనూ అదే జరిగింది. టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆమె ఫోటోకి లైక్ కొట్టారు. దీంతో అవ్‌నీత్‌ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. గంటల వ్యవధిలోనే ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. అయితే ఈ లైక్ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై విరాట్ వివరణ ఇచ్చారు. ఇన్‌స్టాలో ఫీడ్ క్లియర్ చేస్తుండగా.. పొరపాటున లైక్ కొట్టాను అని తెలిపారు.

అయితే అవ్‌నీత్‌ (Avneet Kaur) జీవితం మాత్రం ఈ లైక్‌తో మారిపోయింది. ఇన్‌స్టాలో ఫాలోవర్లు పెరగడం మాత్రమే కాదు.. 12 బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు ఆమె సైన్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అవ్‌నీత్ పరోక్షంగా స్పందించింది. తన తాజా చిత్రం ‘లవ్ ఇన్ వియాత్నాం’ ప్రచారంలో పాల్గొన్న ఆమె తనపై నెటిజన్లే కాదు.. అగ్ర నటీనటులు కూడా ప్రేమ కురిపిస్తున్నారని పేర్కొంది. విరాట్ లైక్ గురించి ‘‘ప్రేమ దొరుకుతూనే ఉండాలి.. నేను ఈ మాటకు మించి చెప్పలేను’’ అని చెప్పింది.

Also Read : దులీప్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News