ఏ ఆలయానికి వెళ్లినా ఎంతో పవిత్రంగా ఉండాలి. దేవుని భక్తితో ఉండాలి.. మనస్సులో వేరే ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు గుడికి వెళ్తే చాలు.. లైక్స్, షేర్ కోసం రీల్స్ చేయడం వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. మలయాళం మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్ (Jasmin Jaffar) కూడా ఇలాంటి పనే చేసి చిక్కుల్లోపడింది. కేరళలోని గురువాయూర్ కృష్ణ ఆలయం ఎంత ప్రసిద్ధమైందో అందరికీ తెలిసిందే. ఈ ఆలయంలో జాస్మిన్ ఓవరాక్షన్ చేసింది. అసలు ఆలయ పరిసరాల్లో షూటింగ్ నిషేధం. కానీ, ఆ నిబంధనను ఉల్లంఘించిన జాస్విన్. ఆలయంలో మొత్తం తిరుగుతూ, ఆలయ కోనేరులో కాళ్లు కడుగుతూ వీడియో తీసింది.
ఈ వీడియోని జాస్విన్ (Jasmin Jaffar) సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె చేసిన ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక హిందూయేతర ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఆలయ నిర్వహకులు ప్రకటన విడుదల చేశారు. వెంటనే ఆలయం అపవిత్రమైందంటూ.. ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ దైవ దర్శనాన్ని నిలిపివేశారు. రుద్రతీర్థం(కోనేరు పేరు)ను శుద్ధి చేస్తున్నారు.
ఈ ఘటన జరిగి ఆరు రోజు కావడంతో ఈ ఆరు రోజులు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. అన్ని పూజలు పూర్తి అయ్యాక గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాల (నలంబలం) ప్రవేశానికి అనుమతి ఇస్తామని అప్పటి వరకూ భక్తులు ఓపికగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : ‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్