Tuesday, August 26, 2025

యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే.. సిఎం, మంత్రులు ఎక్కడ?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే.. సిఎం, మంత్రులు ఎక్కడ? అని ప్రశ్నించారు. సమస్యలు ఇక్కడుంటే సిఎం, మంత్రులు ఉండేది ఢిల్లీ, బీహార్ లోనా? అని కెటిఆర్ నిలదీశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీలకు ఓట్లు..(Votes for parties) రాష్ట్ర ప్రజలకు పాట్లు అని ఎద్దేవా చేశారు. యూరియాను కాంగ్రెస్ ఎంపిలు తేలేరని బిజెపి ఎంపిలు అడగరు అని కెటిఆర్ చురకలంటించారు.

Read Also: వంపుసొంపులతో కవ్విస్తున్న వేధిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News