మాస్ మహరాజ రవితేజ గతకొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘క్రాక్’ సినిమా తర్వాత నుంచి ఆయనకు సరైన హిట్ పడలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రవితేజ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే.. కచ్చితంగా ఆ సినిమాను హిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్‌మీడిలో కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పుకార్లే నిజమయ్యాయి. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా ఆగస్టు 27వ తేదీన విడుదల కావాలింది. కానీ, సినీ పరిశ్రమలో జరుగుతున్న సమ్మెలు, ఇతర సమస్యల వల్ల షూటింగ్ సజావుగా సాగకపోవడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. కంగారుగా విడుదల చేసి చేతులు కాల్చకొనే బదులు.. ప్రేక్షకులతో మంచి మాస్ ట్రీట్ ఇస్తామని వెల్లడించారు.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రవితేజ 75వ చిత్రం కావడం మరో విశేషం. మరి కొత్త విడుదల తేదీ కోసం రవితేజ అభిమానులు ఎధురుచూస్తున్నారు.
Also Read : మన మూలాలు కలిగిన కథా కథనాలతో..