బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. ఇప్పటికే సిఎం మార్పు అంశంపై చర్చ జరుగుతుండగా.. మరోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) మరో వివాదానికి తెర లేపారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రార్థన గీతాన్ని ఆలపించి చిక్కుల్లోపడ్డారు. ఆయన చేసిన ఈ పని కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు నేతలు ఆయన తీరుని విమర్శించారు.
తాజాగా ఈ వివాదంపై శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. బిజెపిని విమర్శించేందుకే తాను ఆ పాట పాడినట్లు తెలిపారు. దీని ద్వారా కొందరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని.. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని స్పష్టం చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే చింతిస్తున్నానని.. అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే ఇవి రాజకీయా ఒత్తిడితో చెబుతున్న క్షమాపణలు కావని అన్నారు. తను గాంధీ కుటుంబంపై, కాంగ్రెస్ పార్టీపై ఉన్న నిబద్ధతకు తిరుగు లేదని తెలిపారు. ‘‘నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించాను, అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని’’ అని శివకుమార్ వెల్లడించారు.
Also Read : పారిపోయేందుకు గోడ దూకిన ఎంఎల్ఎ