- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో మరో నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారంపై చేవెళ్ల ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఆయన ఫుట్‌బాల్‌ని కానుకగా ఇచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తివారీని కలిస్తే.. రామచంద్రరావుని కలవమంటున్నారని.. రామచంద్ర రావును కలిస్తే అభయ్ పటేల్‌ను కలవమంటున్నారని ఆయన ఆయన మండిపడ్డారు. పార్టీలో తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన తెలియజేశారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read : యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోంది: జూపల్లి
- Advertisement -