సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 29వ తేదీన సచివాలయంలోని 6వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి (జిఏడి)కి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణ రావు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కేబినెట్‌లో ప్రధాన అజెండాగా జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనున్నారు. అనంరతం ఆ రిపోర్టును అసెంబ్లీ సమావేశాల తొలి రోజే సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు బిసి రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, సర్పంచ్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణా రావు పాల్గొనున్నారు.
ఈ నెల 29న కేబినెట్ సమావేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -