Tuesday, August 26, 2025

బాధ్యత నాలో ఆనందాన్ని రేకెత్తిస్తుంది: మహ్మద్ సిరాజ్

- Advertisement -
- Advertisement -

ఇటీవల ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో టీం ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల్లో 23 వికెట్లు తీసి సిరీస్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. జస్ర్పీత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడు లేని మ్యాచుల్లో కూడా సిరాజ్ లోటు తెలియనివ్వలేదు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఉత్కంఠగా సాగిన ఐదో టెస్ట్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తనపై బాధ్యత పెట్టినప్పుడు ఎలా రాణించాడో సిరాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘బాధ్యతను మోయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు.. నేను ఎలాంటి సిరీస్‌లో అయినా మెరుగైన ప్రదర్శనే చేస్తాను. బాధ్యత నాలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేదు. అతడిపై వర్క్‌లోడ్ నేపథ్యంలో బౌలింగ్ యూనిట్‌లో సానుకూలత కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం చేశాను. నా సహచరులు, ఆకాశ్‌దీప్, ఇతర బౌలర్లతో మాట్లాడుతున్నప్పుడు మనం సాధించగమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేశా. మనం ఇప్పటికీ సాధించిన వాటిని మళ్లీ చేసి చూపించవచ్చని చెప్పాను’’ అని సిరాజ్ (Mohammed Siraj) తెలిపాడు.

Also Read : ఆమె పోస్ట్‌కి విరాట్ లైక్.. నటి రియాక్షన్ ఇదే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News