Tuesday, August 26, 2025

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం: జోగు రామన్న

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి ప్రవర్తన బాగోలేదు అని, ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం పాట పాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లి కెసిఆర్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.కెసిఆర్ హయాంలో కట్టిన భవనాలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని, ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. దేవీ ప్రసాద్ మాట్లాడుతూ, కెసిఆర్‌ను తెలంగాణ తొలి సిఎంగా మాత్రమే తాము చూడడం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడు అని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్‌ను మానవ మృగమని సిఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌పై వాడిన భాషను ఓ ఉద్యమకారుడిగా తాను ఖండిస్తున్నానని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వంటి విద్యా వేదికపై సిఎం పిచ్చి మాటలు మాట్లాడడం సరికాదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News