హైదరాబాద్‌లో కార్పోరేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్స కు సహాయం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. తమ దీన స్థితిని గాంధీభవన్ మీడియాకు చెప్పడంతో విషయాన్ని జగ్గారెడ్డికి గాంధీ భవన్ మీడియా చేరవేసింది. వివరాల్లోకి వెళితే.. మహాబూబాబాద్ జిల్లా ,కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ 9 సంవత్సరాల వయస్సు లో అనారోగ్యానికి గురైంది.. దసరా పండగ సంధర్భంగా అమ్మమ్మ ఇంటికి వెల్లిన సుష్మ అనుకోకుండా జరిగిన పొరపాటుతో చపాతీ పిండిలో చీమల మందు కలిసిన చపాతీ తిని తీవ్ర అనారోగ్యం పాలైంది. గత 9 సంవంత్సరాలుగా మంచానికే సుష్మ పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో తండి చెవుగాని మహేష్ ,
కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోయారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి తండ్రి మహేష్‌ను పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు డాక్టర్ చంద్రశేఖర్ తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరిక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్ళీ లేచి నడవగలదో చెప్పాలని జగ్గారెడ్డి సూచించారు. సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్దిక సహాయం చేయడమే కాకుండా సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చు లు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి 3 లక్షల ఆర్దిక సహాయం చేస్తూ సుష్మ ఆరోగ్యానికి తమ వంతుగా ఆర్దిక సహాయం చేయాలని కోరారు.. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ నెంబర్‌ను 9553461480 కాంట్రాక్టు చేయాలని కోరారు..