Wednesday, August 27, 2025

విశాఖలో మరో రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

భారత నావికాదళంలో మరో రెండు అధునాతన స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలు చేరాయి. మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను అధికారికంగా నావికాదళంలో చేర్చారు. ఇది సముద్రంలో భారత దేశ బలాన్ని మరింత పెంచింది. రెండు నౌకలు ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇది తొలిసారి. దీంతో భారత దేశం ఇప్పుడు మూడు యుద్ధ నౌకల స్కాడ్రన్‌ను కలిగి ఉంది. ఉదయగిరి, హిమగిరి ప్రాజెక్టు 17 (శివాలిక్) తరగతి నౌకల కొత్త వెర్షన్లు.వీటిలో స్టెల్త్ అంటే రాడార్ నుంచి తప్పించుకోగల సామర్ధం ,ఆయుధం, సెన్సార్ వ్యవస్థల్లో గణనీయమైన మెరుగుదల ఉన్నాయి.

దేశంలో రెండు వేర్వేరు షిప్ యార్డ్‌ల్లో రెండు ఫ్రంట్‌లైన్ సర్ఫేస్ యుద్ధ నౌకలను నిర్మించారు. ఉదయగిరి ప్రాజెక్టు 17ఎయుద్ధ నౌక లోని రెండవ నౌక. దీనిని ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. హిమగిరిని పి17 ఎ ప్రాజెక్టు కింద కోల్‌కతా లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జిఆర్‌ఎస్‌ఇ) నిర్మించింది. ఈ రెండు నౌకలు తూర్పు నావికాదళంలో చేరతాయి. పాకిస్థాన్, చైనా దేశాలకు ఇవి భయం పుట్టిస్తాయని అంటున్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన సముద్ర ప్రయోజనాలను కాపాడుకునే దేశ సామర్థాన్ని ఇవి మరింత బలోపేతం చేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News