- Advertisement -
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎపి ఎఎస్ పి ప్రసాద్ బుధవారం మృతి చెందాడు. ఎల్ బి నగర్ లోని కామినేని ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతూ మరణించాడు. జులై 26న చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ గ్రామం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా స్కార్పియో వాహనం డివైడర్ ను ఢీకొట్టి అనంతరం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎపికి చెందిన ఇద్దరు డిఎస్ పిలు చక్రధర్ రావు, శాంతారావు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఎఎస్ పి ప్రసాద్ తీవ్రంగా గాయపడడంతో కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
- Advertisement -