- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలోని అధిక్వారీ ప్రాంతం ఇంద్రపస్త భోజనాలయం వద్ద కొండ చరియలు విరిగిపడడంతో 30 మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 23 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ సిబ్బంది అక్కడికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
- Advertisement -