- Advertisement -
కామారెడ్డి: వరద నీరు ఇంట్లోకి చేరడంతో గోడ కూలి యువ వైద్యుడు మృతి చెందాడు. ఈ కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేట మండల కేంద్రానికి సమీపంలోదేవుని చెరువు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. దేవుని చెరువు కట్ట తెగి ఇండ్లలోకి నీళ్లు రావడంతో బిసి కాలనీ మునిగిపోయింది. గోడ కూలి యువ వైద్యుడు వినయ్ కుమార్(28) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భారీ వర్షాలు కురవడంతో కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, యాల్లారెడ్డి మండలంలో కొన్ని గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి.
- Advertisement -