Thursday, August 28, 2025

జైస్వాల్ కాదు అని ఆటగాడిని ఎందుకు తీసుకున్నారు: కృష్ణమాచారి శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 15 మంది క్రికెటర్లతో కూడిన స్వాడ్‌ను ఆసియా కప్ కోసం బిసిసిఐ ప్రకటించింది. అక్షర పటేల్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న టీమ్‌తో ఆసియా కప్ గెలుస్తామని స్పష్టం చేశారు, కానీ వరల్డ్ కప్ గెలవడం సాధ్యం కాదని పెదవి విరిచారు. హర్షిత్ రాణా, శివమ్ దూబే, రింకు సింగ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. యశస్వి జైస్వాల్ సెలెక్ట్ చేయడకుండా శివమ్ దూబేను ఎలా? సెలక్ట్ చేశారని ప్రశ్నించారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపిఎల్‌లో జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. ఐపిఎల్‌లో ప్రదర్శనల ఆధారంగా జట్టును సెలక్ట్ చేస్తే బాగుండేదని కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లుంటాయని, ఆసియా కప్ సన్నాహకమా? అని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించారు. అక్షర పటేల్‌ను వైఎస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం అనేది పెద్ద తప్పు అని సెలక్షన్ కమిటీకి చురకలంటించారు. ఐదో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారని, ఆరో స్థానంలో అక్షర పటేల్ బ్యాటింగ్ చేయగలడన్నారు. సెప్టెంబర్ 9న అఫ్గానిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఆసియా కప్ ప్రారంభమవుతుంది. టీమిండియా సెప్టెంబర్ 10న యూఎఇతో ఆడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది. సెప్టెంబర్ 19న ఓమన్ జట్టుతో భారత్ మ్యాచ్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News