- Advertisement -
హైదరాబాద్: అమీర్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ 1444 వద్ద ఉన్న బాలాజీ గీ స్టోర్ లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో పరిసరాలు నిండిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
- Advertisement -