- Advertisement -
హైదరాబాద్: బిసి రిజర్వేషన్ పెంపుపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విమర్శలపై కెసిఆర్ సమాధానం చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ..సిఎం రేవంత్ రెడ్డి తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సమావేశం అయ్యారు. బిసి రిజర్వేషన్ పెంపుపై 3 ఆప్షన్లకు మంత్రుల కమిటీ ఎంపిక చేశారని తెలియజేశారు. ఏ ఆప్షన్ ఎంచుకోవాలన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో బిజెపి ఆమోదం తెలిపిందని తెలియజేశారు. కేంద్రంలో మాత్రం అడ్డుకుంటుందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
Read Also : కెసిఆర్ లా… రేవంత్ పామ్ హౌస్ లో పడుకోవడంలేదు: సీతక్క
- Advertisement -