Thursday, August 28, 2025

ప్రవాహం అవతలి వైపు చిక్కుకుపోయిన పశువుల కాపరిని రక్షిస్తాం: కలెక్టర్ అభిలాష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /నిర్మల్ ప్రతినిధి : నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం మునిపెల్లి గ్రామంలో నిన్న వాగు ప్రవాహం అవతలి వైపు చిక్కుకుపోయిన పశువుల కాపరిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సంఘటన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎన్డిఆర్, ఎస్ఎస్డిఆర్ఎఫ్, గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో మాట్లాడి పశువుల కాపరిని సురక్షితంగా వెనక్కు తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలను వారితో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని అన్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ ఘటన ప్రదేశంలో కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, అదనపు ఎస్పి రాజేష్ మీనా, ఆర్డిఓ రత్నకళ్యాణి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News