Thursday, August 28, 2025

ప్రజల ప్రాణాలు పోతుంటే… ఆటల పోటీలపై రేవంత్ రివ్యూ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ, ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా రేవంత్ తీరు ఉందని చురకలంటించారు. హరీష్ రావు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్‌ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారని, వాళ్లేమో పెళ్ళికి, బీహార్‌లో రాజకీయాలకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకొని ఇద్దరు యువకులు మృతి చెందారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. వారు కొన్ని గంటల పాటు కరెంట్ పోల్‌ ను పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారని, కానీ సహాయం చేసేవారు లేరన్నారు. సహాయం కోసం ఎదురు చూశారని, జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి తాము సమాచారమిచ్చినా వారు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం కరెంట్ పోల్ కూడా కొట్టుకొనిపోవడంతో ఆ ఇద్దరు యువకులు చనిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు.

Also Read: జలదిగ్బంధంలో సిద్దిపేట… మెదక్ లో భారీ వర్షాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News