- Advertisement -
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ముందస్తు రక్షణ చర్యలపై ప్రణాళికలు, సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ప్రజా ప్రతి నిధులు, కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ జరిపారు. గత ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా రక్షణ చర్యలపై దృష్టి పెట్టేవాళ్లమని, ఎన్ డిఆర్ ఎఫ్, ఎస్ డిఆర్ ఎఫ్ విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసేవాళ్లమని కెటిఆర్ తెలియజేశారు.
Read Also : ప్రజల ప్రాణాలు పోతుంటే… ఆటల పోటీలపై రేవంత్ రివ్యూ: హరీష్ రావు
- Advertisement -