- Advertisement -
హైదరాబాద్: చాదర్‌ఘాట్ వద్ద మూసీలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీలోకి వరద ఉదృతంగా ప్రవాహిస్తోంది. నగర శివారులోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తింది. ఈక్రమంలో చాదర్ ఘాట్ పరిధిలోని శంకర్‌నగర్ వద్ద మూసీ ప్రవాహాన్ని చూసేందుకు అందరితోపాటు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తిని స్థానికంగా నివసిస్తున్న సలీంగా గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -