- Advertisement -
నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత్తం బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అఖండ 2’ వాయిదా పడింది. గతంలో ప్రకటించిన మేరకు సెప్టెంబరు 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గురువారం సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఓ లేఖ రిలీజ్ చేశారు. రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా, బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -