- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో చేస్తున్న భారీ ఎంటర్‌టైనర్ చిత్రం రాజా సాబ్ కూడా ఒకటి. ఈ సినిమాని భారీ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ 5న సినిమాను విడుదల చేయాలని ఖరారు చేశారు. నిజానికి ఏప్రిల్‌లోనే రావాల్సిన ఈ సినిమా అలా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈ మధ్యలోనే సినిమా మళ్ళీ జనవరి 9, 2026లో విడుదల అవుతుంది అన్నట్టు కూడా టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో అభిమానులకి ఒక అధికారిక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్… మిరాయ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ రాజా సాబ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న వస్తున్నట్టుగా తెలిపారు.
- Advertisement -