Friday, August 29, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా లోని గోలి వాడ పంప్ హౌస్ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.అనంతరం అంతర్గాం లోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి, టి పి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందిగా ఉండాలని,

వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు. నిపుణులు, ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ , అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు పునరుద్దరణ, మరమ్మత్తు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇరిగేషన్ సి.ఈ. సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. శ్రీనివాస్ గుప్తా, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు, ఆర్డీవో గంగయ్య, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News