Friday, August 29, 2025

టారిఫ్ వార్ తాత్కాలికమే

- Advertisement -
- Advertisement -

అమెరికాతో సుంకాల సమస్య పరిష్కారానికి కొనసాగుతున్న కృషి
ప్రభుత్వవర్గాల స్పష్టీకరణ భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాల
బాదుడు షురూ మూడింట రెండు వంతుల ఉత్పత్తులపై అదనపు భారం
ఇండియాతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉందన్న అమెరికా ఆర్థిక
మంత్రి బెన్సెంట్ రష్యా చమురు దిగుమతి ఆపితేనే సుంకాలు తగ్గిస్తాం
ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ స్పష్టీకరణ ఉక్రెయిన్ సంఘర్షణ
మోడీ యుద్ధమే : వైట్‌హౌస్ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : భారతీయ ఉత్పత్తులపై అమెరికా అదనంగా విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తున్నది. ఈ మేరకు అమెరి కా ఓ ముసాయిదా నోటీసు జారీ చేసింది. దీని ప్రభావం భారతదేశం అమెరికాకు చేసే 48 బిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతులపై పడుతుం ది. అమెరికా మార్కెట్ లో ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకం మొత్తం మీద ఇప్పుడు 50 శాతంగా ఉంటుంది. రష్యా నుంచి చమురు, సై నిక పరికరాలు కొనుగోలు చేసినందుకు జరిమానాగా అమెరికా ఆగస్టు 7న భారతీయ ఉత్పత్తుల పై 25 శాతం సుంకాన్ని విధించింది. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకాలను విధిస్తున్న ట్లు ప్రకటించింది. పెంచిన సుంకాలు 2025 ఆగస్టు 27 మధ్యాహ్నం 12.01 గంటల నుంచి అమలులోకి వస్తాయని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అధిక సుంకాన్ని చెల్లించాల్సిన ఉత్పత్తులలో వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తో లు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యంత్రాలు ఉన్నాయి.

ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ అదనపు సుంకం వర్తించదు. భారతదేశంతో పాటు బ్రెజిల్ పై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతులపై దాదాపు 48.2 బిలియన్ డాలర్ల అదనపు సుంకాలు చెల్లించాల్సివస్తుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించేలా వత్తిడి తెచ్చేందుకే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశంపై ఆంక్షలు విధించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ నెలారంభంలో పేర్కొన్నారు. కాగా, రష్యా చమురును తిరిగి అమ్మడం ద్వారా భారతదేశం ఆర్థికంగా లాభపడిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు. అమెరికా చర్యను ఆగస్టు 6నే భారతదేశం గర్హించింది. అది అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. కొత్త లెవీ తర్వాత తక్కువ సుంకాల కారణంగా భారతదేశ పోటీదారులు మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, చైనా, శ్రీలంక మలేషియా, ఫిలిఫైన్స్,

వియత్నాం అమెరికా మార్కెట్ లో మెరుగైన స్థానంలో ఉంటారు. 2021-22 తర్వాత అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. 2024-15లో ద్వైపాక్షక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా డేటా ప్రకారం భారతదేశ ఎగుమతులు 91.2 బిలియన్ అమెరికా డాలర్లు. 50శాతం సుంకం వల్ల తీవ్రంగా ప్రభావం పడేది వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతుల పైనే. అమెరికా భారీ సుంకాల కారణంగా భారతీయ పరిశ్రమలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా – భారత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై స్పష్టత వచ్చేవరకూ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుని, ఉత్పత్తిని నిలిపివేయవలసి ఉంటుందని తోలు, పాదరక్షల పరిశ్రమ అధికారి ఒకరు తెలిపారు.

రష్యా చమురు ఆపితేనే సంపకాల తగ్గింపు
వాషింగ్టన్ :భారతదేశం రష్యా నుంచి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయని పక్షంలో భారత దిగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ట్రంప్ వైఖరిలో మార్పు ఉండబోదని ప్రెసిడెంట్ ఉన్నత స్థాయి ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. యుఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్ ఈ హెచ్చరిక చేశారు.భారత- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సంక్లిష్టదశలో ఉన్నాయన్నారు. భారతదేశం తన మార్కెట్‌లో అమెరికా ఉత్పత్తులను అవకాశం ఇచ్చే విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. భారతదేశం వైఖరిలో మార్పు ఉండని పక్షంలో ట్రంప్ వెనక్కి తగ్గుతారని తాను భావించడం లేదని కెవిన్ హాసెట్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News