న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంతం వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2038 నాటికి రెండో స్థానానికి చేరుకుంటుందని ఇవై నివేదిక పేర్కొంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఇవై తాజాగా విడుదల చేసిన నివేదికలో, 2030 నాటికి భారతదేశం కొనుగోలు శక్తి సమానత్వం (పిపిపి) 20.7 ట్రిలియన్ డాలర్లకు (రూ.18,13,72,468 కోట్లు) చేరనుంది. ఇది 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాల ర్లు దాటి, అమెరికాను అధిగమించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. భారత ప్రభుత్వం అనుకూ ల విధానాలతో అమెరికా సుంకాల ప్రభావం జిడిపిలో 0.1 శాతానికి పరిమితం చేయవచ్చని నివేదిక తెలిపింది. అమెరికా సుంకాల అనిశ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించి ఇవై తన నివేదికను రూపొందించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, 202425లో భారత్ జిడిపి (పిపిపి) 14.2 ట్రిలియన్ డాలర్లు, ఇది మార్కెట్ ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రకారం కంటే 3.6 రెట్లు ఎక్కువగా ఉంది.
దీంతో భారత్ ప్రపంచంలో చైనా, అమెరికా తరువాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మార్కెట్ ఎక్స్ఛేం జ్ రేట్ల ప్రమాణంలో భారత్ 2028 నాటికి జర్మనీని అధిగమించి మూడో స్థానంలోకి రావచ్చని నివేదిక అంచనా వేసిం ది. ఇవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డి.కె. శ్రీనివాస వ్యా ఖ్యానిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునే అంశాల్లో నైపుణ్యంతో కూడిన యువ శ్రామిక శక్తి, తరచూ పెరుగుతున్న పొ దుపు, పెట్టుబడి రేట్లు, అనుకూల జనాభా నిర్మాణం ఉన్నా యి. ఇవి అస్థిర గ్లోబల్ పరిస్థితుల్లో కూడా భారత్‌కి 6.5% స్థిరమైన వృద్ధిని సాధ్యం చేస్తాయని అంచనా వేశారు. భారత్ తన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి సాంకేతికత, వినూత్న ఉత్పత్తుల్లో సామర్థ్యాలను పెంపొందించాలని, సరైన దిశలో ముం దడుగు వేస్తే భారత్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుందన్నారు.
అమెరికా టారిఫ్‌ల ప్రభావం
ఆగస్టు 27 నుండి అమెరికా భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ కారణంగా సుమారు 48 బిలియన్ డాలర్ల్లు విలువైన ఎగుమతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభావితయ్యే రంగాల్లో టెక్స్‌టైల్స్ అండ్ క్లాతింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రొయ్యలు, లెదర్ అండ్ ఫుట్‌వేర్, జంతు ఉత్పత్తులు, కెమికల్స్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెషినరీ ఉన్నాయి. ప్రభావం లేని రంగాల్లో ఫార్మా, ఎనర్జీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. 202122 నుంచి అమెరికా భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అమెరికా 2024-25లో భారత్ మొత్తం ఎగుమతులలో 20 శాతం (437 బిలియన్ డాలర్లు) వాటా కలిగి ఉంది. ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్ల్లు కాగా, అందులో భారత్ 86.5 బిలియన్ డాలర్లను ఎగుమతి, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతి ఉంది.
జిడిపిపై ప్రభావం ఎంత?
నివేదిక ప్రకారం, ఈ సుంకాల వలన భారత్ జిడిపిలో సుమారు 0.9 శాతం ప్రభావం పడవచ్చని, కానీ ప్రత్యామ్నాయ వ్యూహాలు తీసుకుంటే ఇది 0.3 శాతానికి తగ్గవచ్చని, సరైన విధానాలతో దాదాపు 0.1 శాతం (10 బేసిస్ పాయింట్లు) ప్రభావానికే పరిమితం అవుతుందని తెలిపింది. అంటే 202526లో అంచనా వేసిన 6.5 శాతం వృద్ధి రేటు 6.4 శాతానికి తగ్గవచ్చు. గ్లోబల్ వాణిజ్య ఒత్తిళ్లు, అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉన్నప్పటికీ భారత్ తన దేశీయ డిమాండ్, సాంకేతిక సామర్థ్యాలు, స్థిరమైన ఆర్థిక విధానం ఆధారంగా వేగంగా ఎదుగుతోందని ఇవై విశ్లేషణ స్పష్టం చేసింది.