Friday, August 29, 2025

ముప్పు తొలగలేదు.. అప్రమత్తంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

నష్టంపై పూర్తి నివేదిక సిద్ధం చేసి
మరమ్మతులు చేపట్టండి హైలెవల్
బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి
ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా..తక్షణం
సేవలు అందించడానికి సిద్ధంగా
ఉండండి మేడిగడ్డపై సాంకేతిక కమిటీ
సూచనల ప్రకారం చర్యలు కాళేశ్వరం
బ్యారేజీల్లో నీటి నిలువ క్షేమం కాదని
ఎన్‌డిఎస్‌ఎ చెప్పింది ఏరియల్ సర్వే
అనంతరం సిఎం రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్ : వర్షాల వల్ల ఎంత నష్టం వచ్చింది అనే దానిపై పూర్తిగా నివేదిక సిద్ధం చేసి మరమ్మతుల చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం మెదక్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చిన్న కష్టమొచ్చి నా అధికారులు అప్రమత్తంగా ఉండి వారికి తక్షణ సేవలు అందించేలా చూడాలని సిఎం సూచించారు. మెదక్ జిల్లా లో జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరదముప్పు ఇంకా పోలేదని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రోడ్లు తెగిన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాల్సి న బాధ్యత మనందరిపై ఉందని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

వాగులు, వంకలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిఎం సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వరద నష్టాలను అంచనా వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవల్ బ్రిడ్జిలు క ట్టడానికి చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశించా రు. పంటనష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫొటోక్యాప్చర్ వీ డియో క్యాప్చర్ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాల ను భద్రపరచాలని సిఎం సూచించారు. వర్షపాతం నమో దు వివరాలను ఎప్పటికప్పుడు అంచాన వేస్తూ ప్రజలకు ప లు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని ఆయ న సూచించారు. అంతకుముందు ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం బయలుదేరి వెళ్లారు. హెలిక్యాప్టర్ నుంచి శ్రీపా ద ఎల్లంపల్లి, గోదావరి నదిని సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యా రు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం, అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చించి ముదుకెళ్తామని తెలియజేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఒకే రకంగా కట్టారని ఈ మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ, ఎత్తిపోతలు క్షేమం కాదని ఎన్డీఎస్‌ఏ చెప్పిందన్నారు. నీరు నిల్వ చేశాక మొ త్తం కూలిపోతే గ్రామాలు కొట్టుకుపోతాయని రేవంత్ ఆం దోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని ముఖ్యమంత్రి విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజె క్టు మనకు ప్రాణవాయువు అన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకమని ఆయన చెప్పారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని ఆయన చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుల మధ్య తేడా ఉందన్నా రు.మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని, మేడిగడ్డ రిపేరు చేయకుండా అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవచ్చ కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సిఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇస్తూ అతి తెలివితేటలతో మామ, అల్లుడు ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం తో నిర్మించారన్నారు.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలని, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలని సిఎం రేవంత్ సూచించారు. 3 బ్యారేజీల డిజైన్‌లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉందన్నా రు. తాము 80 వేల పుస్తకాలు చదవలేదని, 80 వేల పుస్తకాలు చదివిన మేధావి సలహా అడుతున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. అనంతరం వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో సిఎం రేవంత్‌రెడ్డి ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. దీంతో సిఎం మెదక్ పోలీస్ పెరేడ్‌గ్రౌండ్‌కు హెలికాప్టర్ ల్యాండ్ ద్వారా చేరుకున్నారు. ముందుగా పోలీస్ పెరేడ్‌గ్రౌండ్‌లో సిఎం రేవంత్ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ రాహుల్ ఎస్పీ డివి శ్రీనివాసరావులు సిఎంకు స్వాతగం పలికారు. అనంతరం వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంటపాట సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపి రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో జరిగిన నష్టం గురించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సిఎంకు వివరించారు. వరదలకు జిల్లాలో ఇద్దరు మృతి చెందడంపై సిఎం విచారం వ్యక్తం చేశారు. వారికి ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను సిఎం రేవంత్ ఆదేశించారు.

యూరియా కొరతలో బఫర్ స్టాక్ డిస్‌ప్లే
జిల్లాలో యూరియా కొరత విషయంలో బఫర్ స్టాక్ డిస్‌ప్లే చేస్తూ ఉన్నామని రైతులు రాబోయే పంటల కోసం ఇప్పటి నుంచే యూరియాను కొనుగోళ్లు చేయడం వల్ల కొరత ఏర్పడిందని అధికారులు సిఎం రేవంత్‌తో పేర్కొన్నారు. యూరియాపై రైతులకు అవగాహన పెంపొందించాలని సిఎం రేవంత్ సూచించారు. మెదక్ పట్టణం పిల్లికొట్టాల్‌లో నీట మునిగిన సబ్ స్టేషన్ కు బదులు మరో కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డికి ఎంపి రఘునందన్‌రావు విజ్ఞప్తిచేశారు. మెదక్ నుంచి కామారెడ్డి వెళ్లే రహదారిని నాలుగులేన్‌లుగా మార్చాలని, బుధవారం నీట ము నిగిన రామాయంపేట హాస్టల్ భవనాన్ని మరోచోట నిర్మించాలని సిఎంకు ఎంపి రఘునందన్ విన్నవించారు. దీనిపై సిఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. విపత్తు నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలని ఎంపి రఘునందన్‌కు సిఎం రేవంత్ సూచించారు. అధికారులతో సమీక్ష అనంతరం ప్లడ్ ఎఫెక్టడ్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సిఎం రేవంత్‌రెడ్డి తిలకించారు. తిరిగి సాయంత్రం 6.20 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌కు పయణమయ్యారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాల సాయం
రాష్ట్రంలో కురుసిన భారీ వర్షాలు, వరదలు, సహయక చర్యలపై సిఎం రేవంత్ రెడ్డి బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదలు, ప్రస్తుతం అందుతున్న సహాయక చర్యల గురించి అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు.
వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సిఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం రా త్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జి ల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానల వల్ల వాగులు, వంకలు ఉప్పొం గి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరదలో మునిగిపోగా కామారెడ్డిలో రైలు పట్టాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిస్థితి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. రెండు జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News