చిగురుటాకులా వణికిన కామారెడ్డి, నిజామాబాద్ జలదిగ్బంధంలో
చిక్కుకున్న పల్లెలు చెరువులను తలపిస్తున్న పట్టణాలు జనజీవనం
అస్తవ్యస్తం కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు తెగిన రాష్ట్ర, జాతీయ
రహదారులు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు పలు రైళ్లు
రద్దు..మరికొన్ని దారి మళ్లింపు ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు
మరో రెండు రోజుల పాటు వర్షాలు పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్
13 జిల్లాల్లో పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రాథమిక
నివేదిక సమర్పించండి : వివిధ శాఖల కార్యదర్శులకు సిఎస్ ఆదేశం
పంట నష్ట నివారణ చర్యలు చేపట్టండి : మంత్రి తుమ్మల అన్ని జిల్లాల్లో
ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది : మంత్రి కిషన్‌రెడ్డి వర్షబీభత్సంపై కెసిఆర్
ఆందోళన బాధితులకు అండగా ఉండాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు
మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించని విధంగా వరుణ బీభత్సానికి జిల్లా ఆతలాకుతుల అయింది. సముద్రం నుండి మేఘాలు నీటిని తీసుకువచ్చి నేరుగా కామారెడ్డి జిల్లా మీదనే కుమ్మరించినట్టు క్లౌడ్ బ్లస్టర్‌తో విధ్వంసం సృష్టించడంతో ఒక్కసారిగా జిల్లాలో భయం పుట్టించింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన విధంగానే భారీ వర్షాలు కురుయడంతో చెరువులకు గండిపడడంతో లోతట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామాలలో నీరు చేరుకోవడంతో పాటు పశువులు వరద ఉధృతికి కొట్టుకపోగా రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. జిల్లాలోని రాజంపేట మండలంలో ఏకంగా ఒక్కరోజులోనే 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దీని తీవ్రత కామారెడ్డి జిల్లా కేంద్రానికి తీవ్ర ప్రభావం చూపడంతో జాతీయ రహదారి రైల్వే ట్రాక్ లు దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రాజంపేట మండలంలోని పలు చెరువులు గండిపడటంతో ఒక్కసారిగా రాజంపేట మండల కేంద్రంలోని భారీగా నీరు చేరుకోవడంతో పలు ధ్వంసం కాగా గోడకూలి వినయ్ కుమార్ డాక్టర్ మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఎల్బీనగర్ విద్యానగర్ దేవునిపల్లి, బతుకమ్మ కుంట, అశోక్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీ లతోపాటు లోతట్టు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాలలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరడంతో కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయట పార్కింగ్ చేసిన వాహనాలు వరద ఉధృతికి కొట్టుకపోయాయి. నిజాంసాగర్ మండలం అన్నాసాగర్ లో ఎనిమిది మంది వలస కూలీలు వరదల్లో చిక్కిపోవడంతో ఎస్పీ పర్యావేక్షణలో ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బందితో చేరుకొని వారిని రక్షించారు. మహమ్మద్ నగర్ మండలంలోని గున్కల్ శివారులో వాగులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడగలిగారు. ఎల్లారెడ్డి సమీపంలో కొట్టాల వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
రాజంపేట మండలంలోని నడిపి తండా, గుడి తండా, ఎల్లాపూర్ తండా జలతిబ్బంధంలో ఉండడంతో వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం వరకు భిక్కనూరు మండలంలో టోల్ ప్లాజా సమీపంలో రామేశ్వర్ పల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద ఉధృతి మారడంతో జాతీయ ధ్వంసం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు. సుమారుగా 10 గంటల పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా ఓకే రోడ్డు నుండి ఇరువైపులా వాహనాలను పంపించి మెల్లమెల్లగా ట్రాఫిక్ లో క్లియర్ చేయగా మళ్లీ గురువారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురవడంతో మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో వాహనాదారులకు ముందస్తుగానే సమాచారాన్ని అందించారు. హైదరాబాద్ వెళ్లేవారు నిజామాబాద్ నుండి కోరుట్ల,కరీంనగర్,మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచించారు. రానున్న రెండు రోజులు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రచారంతో ఏం జరుగుతుందోనని భయంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
వర్షంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలలో వెళ్లాలని అధికారులు ప్రచారం నిర్వహించి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనాకామారెడ్డి చరిత్రలో ఇంతటి వరద బీభత్సం ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వర్ష బావ పరిస్థితులను దృష్టిలో పాఠశాలలకు బంద్ ప్రకటించారు. వర్ష పరిస్థితులపై మంత్రి సీతక్క అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.