- Advertisement -
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్- ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే మూవీ మేకర్స్ ఒక కీలకమైన కొత్త క్యారెక్టర్ని పరిచయం చేశారు. శోభగా శిల్పా శిరోద్కర్ని పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో ఆమె బ్లాక్ చీర కట్టుకుని, హోమగుండం ముందు కూర్చొని కనిపించారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు.
- Advertisement -