Friday, August 29, 2025

‘వేదవ్యాస్’ ఆరంభం

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా ‘వేదవ్యాస్’ గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.

చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు ‘హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్’ అంటూ బొకే అందించగా ఆమె ‘థాంక్యూ సర్’ అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు. కాగా ఈ ముహూర్తపు షాట్ కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి సినిమాలు చూస్తూ పెరిగాం.

ఆయన సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేశాం. కృష్ణారెడ్డి తన 43వ సినిమా చేస్తుండటం, ఆ సినిమా ప్రారంభోత్సవానికి నేను అతిథిగా రావడం సంతోషంగా ఉంది. వేదవ్యాస్ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం”అని అన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ “తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News