Friday, August 29, 2025

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరో.. ఘనంగా ఎంగేజ్‌మెంట్

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ నటుడు విశాల్ (Vishal), నటి సాయి ధన్సిక త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. వీరిద్దరికి శుక్రవారం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. తన పుట్టినరోజునే ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని విశాల్ పేర్కొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విశాల్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో తమ ఎంగేజ్‌మెంట్ జరిగిందని.. అందరి ఆశీస్సులు తమపై ఉండాలని విశాల్ కోరుకున్నారు. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

విశాల్ (Vishal) మాతృభాష తెలుగు అయినప్పటికీ.. ఆయన తమిళ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. అయిన సినిమాలు అన్ని తెలుగులో కూడా అనువదించారు. దీంతో టాలీవుడ్‌లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే విశాల్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘నడిగర్ సంఘం’ భవనం పూర్తి అయ్యేకే తాను వివాహం చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు. ఈ ఏడాది మేలో భవన నిర్మాణం పూర్తికాగానే త్వరలో ప్రేమ వివాహం చేసుకుంటానని విశాల్ వెల్లడించారు. ధన్సిక నటించిన ‘యోగీ దా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్ ఆమెతో తన ప్రేమ గురించి బయటపెట్టారు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందని తెలిపారు.

Also Read : హృదయాలను హత్తుకునేలా ‘సువ్వి సువ్వి..’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News