- Advertisement -
హైదరాబాద్లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం పలు చోట్లు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మణికొండ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, తదితర జిల్లాలు ఆగమాగమయ్యాయి. వరద ప్రవాహంలో పలు గ్రామాలు, తండాలు నీట మునిగిపోయాయి. దీంతో చాలా మంది నీరాశ్రులయ్యారు.
- Advertisement -