Friday, August 29, 2025

బిగ్ ట్విస్ట్..: బిసిసిఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

భారత క్రికెట్‌లో పెద్ద ట్విస్ చోటు చేసుకుంది. ఆసియా కప్‌కి కొద్ది రోజుల ముందు బిసిసిఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ (Roger Binny) రాజీనామా చేశారు. తాజాగా జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యాక్షుడు రాజీవ్ శుక్లా వ్యవహరిస్తారు. రోజర్ బిన్నీ రాజీనాయ వెనుక ఎలాంటి కారణాలు లేవు. బిసిసిఐ నిబంధనల ప్రకారం 70 దాటిన వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడం సాధ్యపడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టారు. అందుకే అతను స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం అధికారికంగా ప్రకటించబడింది.

Also Read : దాని గురించి మాట్లాడను.. విడాకులపై తొలిసారి స్పందించిన షమీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News