Friday, August 29, 2025

ఓ సైలెంట్ ప్రేమ కథ.. ‘మోగ్లీ’ ప్రపంచాన్ని చూసేయండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘బబుల్‌గమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ (Mowgli). ఈ చిత్రం ఫారెస్ట్‌లో సాగే ఓ ప్రేమ కథ. ఈ సినిమా గ్లింప్స్‌ని ప్రముఖ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ’ పేరుతో విడుదల చేశారు.

25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడంటూ నాని వాయిస్‌తో డైలాగ్‌ ప్రారంభమౌతుంది. టీజర్‌లో (Mowgli) అడవిలో ప్రేమ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్లు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకు ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో సాక్షి మహదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హీరో ఫ్రెండ్ పాత్రలో హర్ష నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : మైసూర్‌లో గ్రాండ్ గా ‘పెద్ది’ సాంగ్ షూట్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News