Saturday, August 30, 2025

అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి: మహువా మొయిత్రా

- Advertisement -
- Advertisement -

తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి వివాదం రేపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ అమిత్‌షా తలనరికి టేబుల్ మీద పెట్టాలి ’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పశ్చిమబెంగాల్ లోకి బంగ్లా అక్రమ వలసదారుల ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే వందలాది మంది చొరబాటుదారులు లోపలకు అడుగుపెట్టి మన మహిళలను అగౌరవపరుస్తూ మన భూములను లాక్కుంటుంటే మనం అమిత్‌షా తల నరికి టేబిల్‌పై పెట్టాలి. అదీ మన బాధ్యత.అని మహువా మొయిత్రా అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చొరబాటుదారుల వల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయని చెప్పారని, అప్పుడు ముందువరుసలో ఉన్న అమిత్‌షా నవ్వుతూ చప్పట్లు కొట్టారని ఆమె అన్నారు. సరిహద్దుల వెంబడి బిఎస్‌ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. విద్వేషంతో విషం చిమ్మేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంలో ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News