- Advertisement -
యూరియా లేదని ఓ రైతు తన పత్తి చేనును పీకేశాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పర్వతగిరి మండలం, ఎపితండా గ్రామ పంచాయతీ పరిధి, ఉట్టితండాకు చెందిన భూక్య బాలు అనే రైతు యూరియా బస్తాలు దొరకకపోవడంతో తనకున్న1.20 ఎకరాల్లో పత్తి చేనును కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పీకేశాడు. తనకు 8 ఎకరాల చెలక, 1.20 ఎకరాల పొలం ఉందని, వారం రోజుల నుంచి యూరియా బస్తాల కోసం తిరిగి విసుగుచెంది పత్తి చేను పీకేసినట్లు రోదిస్తూ తెలిపాడు.
- Advertisement -