Saturday, August 30, 2025

ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బేసిన్ వెలుపల నీటి దోపిడికి పాల్పడుతోందని, ఇప్పటికే 40 టీఎంసీల నీ టిని మళ్లించిందని తెలంగాణ నీటిపారుదల శా ఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్ జస్టిస్ బ్రజేష్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ తన వాదనల ను బలంగా వినిపించారు. ఎపి సర్కారు నీటి మ ళ్లింపు అంశాలపై ఉదాహరణలతో సహా ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు గంగా ప్రా జెక్టు ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపల 40 టీఎంసీల నీటిని మ ళ్లించిందని ఆరోపించారు. తీవ్రంగా నీటి కొర త ఉన్న ఏడాదిలో కూడా నీటిమళ్లింపులు జరిగాయన్నారు. బేసిన్ అవతల వినియోగం వల్ల రి టర్న్ ఫ్లోలు బేసిన్‌లో అందుబాటులో ఉండడం లేదని వైద్యనాథన్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకు వ చ్చారు. బేసిన్ అవతల ప్రాజెక్టులకు ఎటువంటి కేటాయింపులను పరిగణనలోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. బేసిన్ వెలుపల ప్రాజెక్టుల కు నీటి మళ్లింపు, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కేటాయింపులు, శ్రీశైలం, పులిచింతల నుంచి ఆవిరి నష్టాలపై తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది.

ఆయకట్టు విస్తరణపై తీవ్ర అభ్యంతరం
కేంద్ర ప్రభుత్వం జూలై 2022లో జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ తప్పుగా అన్వయించిందని తెలంగాణ ఆరోపించింది. గతంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యూనల్ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండా మిగిలిన నీటిని మాత్రమే వినియోగించుకునే స్వేచ్ఛ ఎపికి ఉండేదని తెలంగాణ వాదించింది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ అవుట్‌లెట్స్ వంటి వివిధ డ్రా సిస్టమ్స్‌పై నిర్దిష్ట ఆంక్షలు విధించాలని, నియంత్రణ సంస్థకు అధికారాలు ఇవ్వాలని వైద్యనాథన్ కోరారు. అవార్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి మళ్లింపులు జరగకుండా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గోదావరి మళ్లింపుతో ఆందోళనలు
గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం ద్వారా కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కోసం కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయని వైద్యనాథన్ గుర్తుచేశారు. కృష్ణా బేసిన్‌లో నీటి కొరత ఎపి బేసిన్ అవతల వినియోగం కోసం అధిక కేటాయింపుల వల్ల ఏర్పడిందని వాదించారు. నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల నీటిని పంపిణీ చేయడానికి 1978లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలోని బేసిన్ అవసరాలు తీరినందున, ఆంధ్రప్రదేశ్ బేసిన్ అవతల ప్రాజెక్టులకు అడిగిన 45 టీఎంసీలను కేటాయించకూడదని ట్రైబ్యునల్‌ను ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News