న్యూఢిల్ల : ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)పై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, ఈ ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం అక్టోబర్-, నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకంపై గోయల్ స్పందిస్తూ, ఈ సుంకం భారత్ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. అమెరికా తన వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మరింత మార్కెట్ యాక్సెస్ కోరుతోందని, భారతదేశం తమ రైతులు, పశుపోషకుల ప్రయోజనాలను కాపాడడంలో రాజీపడబోదని స్పష్టం చేసింది. ఆగస్టు 25 నుంచి జరగాల్సిన ఆరో రౌండ్ చర్చలను అమెరికా బృందం వాయిదా వేసింది. అయితే, ఈ ఏడాది ఎగుమతులు 2024-25 కంటే ఎక్కువగా ఉంటాయని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ ఎగుమతులు భారీగా లేనందున, ఈ సుంకాల పట్ల భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చలు జరుపుతున్నాం: గోయల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -