- Advertisement -
ముంబై : ఈ వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు తగ్గి 79,810 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు తగ్గి 24,427 వద్ద స్థిరపడింది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 17 పెరగ్గా, 13 నష్టపోయాయి. ఐటిసి, బిఇఎల్‌తో సహా 6 స్టాక్‌లు 2 శాతం లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు 3 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 23 పెరిగాయి, 27 నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో రియాలిటీ, ఆటో, చమురు, గ్యాస్ సూచీలు అత్యధికంగా పడిపోయాయి. ఎఫ్‌ఎంసిజి, మీడియా సూచీలు పెరిగాయి.
- Advertisement -